తెలంగాణలో రామ రాజ్యం, మోదీ రాజ్యం రావాలి- బండి సంజయ్
కేసీఆర్ దొంగ దీక్షను బయటపెట్టిన చరిత్ర మీ ఖమ్మం ప్రజలదన్నారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్. ఉద్యమాల గడ్డ ఖమ్మం. చైతన్యం, పౌరుషం కలిగిన గడ్డ ఈ ఖమ్మం గడ్డ అంటూ ప్రసంగం మొదలుపెట్టారు. కేసీఆర్ పేరు దుబాయ్ శేఖర్ అంటూ దుయ్యబట్టారు. పేదలను దుబాయ్ తీసుకపోతనని చెప్పి మోసం చేసిన వ్యక్తి కేసీఆర్ అని అన్నారు. కొడుకు పేరును మార్చి కల్వకుంట్ల తారక రామారావు అని చెప్పి నాటకాలు ఆడే మనిషి కేసీఆర్ అన్నారు. మోసం చేయడం బాగా తెలిసిన వ్యక్తి కేసీఆర్ అని అన్నారు. ఎన్నికలు వస్తేనే.. పేదోళ్లకు ఇండ్లు, రైతులకు రుణమాఫీ, ఉద్యోగాలు గుర్తొస్తయ్. అందుకే మీరంతా ఆలోచన చేసి, కేసీఆర్ సర్కారును సాగనంపాలన్నారు. నరేంద్రమోదీ నేతృత్వంలో అమిత్ షా మార్గదర్శకత్వంలో బీజేపీ అధికారంలోకి రావాలన్నారు. తెలంగాణలో రామరాజ్యం రావాలి. మోదీ రాజ్యం రావాలి. ఇందుకోసం మీరంతా సహకరించాలని ఓటర్లకు సంజయ్ విజ్ఞప్తి చేశారు.


