InternationalNews

తెలుగువెలుగు… అమెరికాలో టాప్ 20 భాషల్లో తెలుగు

Share with

అమెరికాలోనే అధిక సంఖ్యల్లో మాట్లాడే మొదటి 20 భాషల్లో తెలుగుకు స్ధానం దక్కడమే కాకుండా..అతి వేగంగాఅభివృద్ధి చెందుతున్న భాషగా రూపుదిద్దుకోవడం సంతోషమని మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ అన్నారు. ఉత్తర కాలిఫోర్నియాలోని మిల్‌పిటాస్‌ సిలికానాంధ్ర విశ్వవిద్యాలయ ప్రాంగణంలోని డాక్టరు లక్కిరెడ్డి హనిమిరెడ్డి భవనంలో జరిగిన స్నాతకోత్సవ సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తెలుగు భాషాభివృద్ధికి సిలికానాంధ్ర మనబడి ఎంతగానో కృషి చేస్తోందన్నారు. అతి తక్కవ సమయంలో 75 వేల మందికి తెలుగు నేర్పడం అద్భుతమన్నారు.15 ఏళ్లుగా చిన్నారులకు తెలుగు నేర్పిస్తున్న విద్యాసంస్ధ సిలికానాంధ్ర మనబడి అని కొనియాడారు. 2021-22విద్యా సంవత్సరానికి 1,689 మంది జూనియర్ సర్టిఫికెట్ పరీక్షకు హాజరవ్వగా 97.8 శాతం మంది, 1,102 మంది సినియర్ సర్టిఫికెట్ పరీక్షకు హాజరవ్వగా 97.7 శాతం మంది ఉత్తీర్ణత సాధించారని సిలికానాంధ్ర, మనబడి అధినేత చమర్తి రాజు తెలిపారు.

తెలుగు విశ్వవిద్యాలయ భాగస్వామ్యంతో ఎనిమిదేళ్లుగా ఈ సర్టిఫికెట్ పరిక్షలు నిర్వహిస్తున్నామన్నారు. ఈ విజయం వెనుక 2,500 మంది భాషా సైనికుల సేవ ఉందని, అమెరికాలోని పిల్లలకు తెలుగు సంస్కృతి, సంప్రదాయాలతో పాటు భాషనూ నేర్పస్తున్నామని సంస్ధ వ్యవస్ధాపక అధ్యక్షుడు కూచిబొట్ల ఆనంద్ తెలిపారు. ఈ స్నాతకోత్సవ సందర్భంగా గుమ్మడి గోపాలక్రిష్ణ దర్శకత్వంలో మనబడి విద్యర్ధుల శ్రీకృష్ణ రాయబారం పద్యనాటకం ఆకట్టుకుంది. దీనికి సమన్వయకర్తలుగా రాధాశాస్త్రి, గంటి శ్రీదేవి వ్యవహరించారు. 2022-23 మనబడి విద్యాసంవత్సరం సెప్టెంబర్ నుండి మెదలైతుందని సంస్ద అధినేత చమర్తి రాజు అన్నారు. కొండ పర్తి దిలీప్, కూచిబొట్ల శాంతి, కందుల సాయి, సంగరాజు దిలీప్, కోట్ని శ్రీరాం, తనారి గిరి, కస్తూరి ఫణిమాధవ్ తెలుగు వెలుగులకు సహకారం అందిస్తున్నారు.

Read more:కెరీర్‌లో తొలిసారిగా డిజిటల్ వైపు కృష్ణవంశీ