InternationalNews

రహస్య బంకర్‌ నుంచి పారిపోయిన గొటబయ

Share with

శ్రీలంక రాజధాని కొలంబో లో నిరసనకారులు అధ్యక్షుడు గొటబయ రాజపక్స అధికార నివాసాన్ని చుట్టుముట్టిన సంగతి తెలిసిందే. రాజపక్స రాజీనామా చేయాలంటూ ఆందోళనకారులు ఆయన నివాసంలోకి చొరబడి “గొట గో హోం” అంటూ నినాదాలతో రాజపక్స అధికార నివాసాన్ని ముట్టడించి ఆందోళనలు చేపట్టారు. ఆదివారంనాడు అధ్యక్ష భవనంలోకి ప్రవేశించిన నిరసనకారులు ఒక గదిలో అలమారా తలుపు తెరిచి చూసి ఆశ్చర్యపోయారు,దాని వెనుక ఉన్న దారి గుండా వెళ్తే అండర్‌ గ్రౌండ్‌లో ఒక హైసెక్యూరిటీ బంకర్‌ బయటపడింది.ఈ రహస్య బంకర్‌ని ఉపయోగించి రాజపక్స పరారైనట్లు తెలుస్తోంది. ఇది భూగర్భ సోరంగంలా ఉంది. లిఫ్ట్‌ ద్వారా మాత్రమే ఈ రహస్య బంకర్‌లోకి ప్రవేశించగలరు. ఆందోళనలపై ముందుగానే సమాచారం ఉండడంతో శుక్రవారం రాత్రే రాజపక్స ఇదే రహస్య బంకరు ను ఉపయోగించి పరారై ఉంటారని తెలుస్తుంది.
అక్కడ బంకర్‌ ఉన్న విషయాన్ని శ్రీలంక స్పెషల్‌ టాస్క్‌ఫోర్స్‌ బృందం ధ్రువీకరించింది. రాజపక్స ను ఆర్మీ ప్రధాన కార్యాలయానికి తరలించారని.. నౌకలో పారిపోయారని.. రకరకాల వార్తలు వస్తున్నప్పటికి. ప్రస్తుతం గొటబాయ ఎక్కడున్నారన్నది తెలియరాలేదు. మొత్తానికి ఆయన అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.పార్లమెంటు స్పీకర్ మహింద యప అబే‌వర్ధన తో మాత్రం కాంటాక్ట్‌లో ఉన్నట్టు తెలుస్తోంది.