తెలంగాణ అంతటా విద్యా సంస్థలకు మూడు రోజుల సెలవు- కేసీఆర్
హైదరాబాద్ ను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటనతో… హైదరాబాద్ పోలీసులు అలర్ట్ అయ్యారు. వాతావరణ శాఖ మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. దీంతో అన్ని విద్యాసంస్థలకు మూడు రోజులు సెలవులు ప్రకటించింది. హైదరాబాద్ సిటీలో రాత్రిపూట కూడా ట్రాఫిక్ మరియు లా అండ్ ఆర్డర్ పోలీసులు విధుల్లో ఉంటారన్నారు- సిపి, సివి ఆనంద్. జిహెచ్ఎంసి ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో సమన్వయంగా కలిసి పనిచేస్తామన్నారు. బయటకు వెళ్లేటప్పుడు వాతావరణాన్ని గమనించి వెళ్లాలని సూచిస్తున్నామన్నారు. అత్యవసరమైతే తప్ప ఇంటి నుండి బయటకు రాకుండా ఉండాలని ప్రజలను కోరుకుంటున్నామని సిపి సివి ఆనంద్ తెలిపారు.