మరికాసేపట్లో స్పీకర్‌కు రాజగోపాల్ రెడ్డి రాజీనామా లేఖ
కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇవాళ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధమయ్యారు. రాజీనామా చేసేందుకు స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అపాయింట్మెంట్ తీసుకున్నారు. ఉదయం పదిన్నర గంటలకు స్పీకర్ ఫార్మాట్‌లో రాజీనామా సమర్పిస్తారు. తెలంగాణ రాజకీయాల్లో పెను మార్పులకు ఈ రాజీనామా కారణం అవుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఓవైపు అధికార టీఆర్ఎస్ పార్టీపై వ్యతిరేకత, మరోవైపు కాంగ్రెస్ పార్టీలో కల్లోలం… కలిసి వస్తోందని రాజగోపాల్ రెడ్డి అంచనా వేస్తున్నారు. కోమటిరెడ్డి రాజీనామాతో తెలంగాణలో మరోవార్ జరగనుంది. రాజీనామాను స్పీకర్ ఇవాళే ఆమోదించే అవకాశమున్నట్టు తెలుస్తోంది.