NewsTelangana

జోరుగా వానలు

Share with

ఏపీ, తెలంగాణలో మళ్లీ జోరుగా వానలు కురుస్తున్నాయ్. బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో రాత్రంతా వర్షం కురిసింది. ఇవాళ, రేపు కూడా భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఉమ్మడి ఖ్మం, నల్గొండ జిల్లాల్లో వరద ఉధృతితో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. ఇక హైదరాబాద్‌లో రాత్రంతా కురిసిన వానలతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. సోమవారం ఉదయం నుంచి వర్షం కురుస్తోంది. అల్పపీడనం ఒడిశా, బెంగాల్ వైపు దూసుకెళ్తోంది. 24 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు.