నాంపల్లి కోర్టుకు రాజాసింగ్
బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ నాంపల్లి కోర్టులో హాజరు పరిచారు. భారీ బందోబస్తు మధ్య బొల్లారం పోలీసు స్టేషన్ నుంచి నాంపల్లి కోర్టుకు తరలించారు. నిన్న రాత్రి జరిగిన ఆందోళనలు, ఫిర్యాదుల నేపథ్యంలో పోలీసులు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. కోర్టు ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించే అవకాశం కనిపిస్తోంది.
మరోవైపు రాజాసింగ్ ఇంతకు ముందు మాట్లాడుతూ.. తన వ్యాఖ్యలు వివాదస్పదమవుతాయనే విషయం తనకు తెలుసని… కానీ, ధర్మం కోసం తాను ఇలాగే మాట్లాడతానని చెప్పారు. చావుకు సైతం తాను సిద్ధమేనని అన్నారు. పోలీస్ స్టేషన్ నుంచి విడుదలైన తర్వాత వీడియో రెండో పార్టును కూడా రిలీజ్ చేస్తానని చెప్పారు. తనపై ఎలాంటి చర్యలు తీసుకున్నా తాను ఎప్పుడూ మోదీ, అమిత్ షా అభిమానిగానే ఉంటానని అన్నారు.
మరోవైపు ఈ వ్యాఖ్యల నేపథ్యంలో బీజేపీ పార్టీ అధిష్ఠానం ఆయనపై చర్యలు తీసుకుంది. బీజేపీ శాసనసభాపక్ష నేత పదవి నుంచి, పార్టీ నుంచి ఆయనను సస్పెండ్ చేసింది.

