వరదబాధితులకు సైన్యం చేయూత
ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు మేమున్నామంటూ సహాయం చేయడానికి ఎప్పుడూ సిద్దంగా ఉంటారు మన సైనికులు. తెలంగాణ రాష్ట్రాన్ని వారంగా కురుస్తున్న భారీ వర్షాలు , వరదలు ముంచెత్తుతున్నాయి. దీంతో విపత్కర పరిస్థితులు ఏర్పడ్డాయి. జనజీవనం స్తంభించింది. రహదారులు నదులను తలపిస్తున్నాయి. నదులు పొంగిపొర్లుతున్నాయి. ఈ పరిస్థితులను ఎదుర్కొనేందుకు, ప్రభుత్వానికి సహాయం చేసేందుకు భారత సైన్యానికి చెందిన 101 మందితో కూడిన బృందం రంగంలోకి దిగింది. వరద సహాయచర్యలలో సైనికులు చురుకుగా పాల్గొంటున్నారు. ఎట్టి పరిస్ధితులలో ప్రాణనష్టం కలుగకుండా చూసుకోడానికి ప్రజలకు అండగా నిలుస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, పెద్దపల్లి, భూపాలపల్లి జిల్లాలో పర్యటించి పునరావాస చర్యల్లో పాల్గొంటారు.