మూసీ ఉగ్రరూపం… వామ్మో మళ్లీ వర్షాలా…!
తెలంగాణలో జోరుగా వర్షాలు కురుస్తున్నాయ్… వామ్మో ఇక చాలు అనుకునేలా పరిస్థితులు వచ్చేశాయ్. రోజూ కురుస్తున్న వర్షాలతో ఇప్పటికే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న జనాలకు మరో రెండ్రోజులు భారీ వర్షాలు కురుస్తాయంటూ వాతావరణ శాఖ హెచ్చరికలు నిద్ర పట్టనివ్వడం లేదు. మూసీ ఉగ్రరూపం దాల్చడంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు భయం గుప్పిట్లో బతుకుతున్నారు. జంట జలశయాల్లోకి భారీగా వరదనీరు చేరుకుంటోంది. 15 వేల క్యూసెక్కులపైనే నీటిని అధికారులు విడుదల చేశారు. ఉస్మాన్ సాగర్ లో రికార్డు స్థాయిలో వరద నీరు చేరుకోవడంతో పదేళ్ల తర్వాత తొలిసారి 15 గేట్లలో 13 గేట్లను ఆరు అడుగుల మేర ఎత్తారు. ఇవాళ, రేపు భారీ వర్షాలు కురిసే అవకాశముందంటూ వాతావరణ శాఖ ఎల్లో హెచ్చరికలను జారీ చేసింది. ఏపీలో పశ్చిమ బంగాళాఖాతంలో ఆవర్తనం కేంద్రీకృతం కావడంతో భారీ వర్షాలకు అవకాశం ఉందని పేర్కొంది.