NewsTelangana

హైదరాబాద్ లో మళ్ళీ వర్షాలు..జనజీవనం అస్తవ్యస్థం

Share with

ఇటీవల కాలంలో భారీ వర్షాలతో హైదరాబాద్ నగరం తడిసి ముద్దయ్యింది.అయితే వరుణుడు గత కొన్ని రోజులుగా కొంత శాంతించడంతో నగర వాసులు ఊపిరి పీల్చుకుంటున్నారు.ఈ నేపథ్యంలో  ఉదయం నుండి వరుణుడు తన ప్రతాపాన్ని మళ్ళీ చూపిస్తున్నాడు.ఈ రోజు ఉదయం నుండి కురుస్తున్న భారీ వర్షాలతో నగర వాసులు అవస్థలు పడుతున్నారు.ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు హైదరాబాద్‌లోని పలు కాలనీలు చెరువులను తలపిస్తున్నాయి.దీంతో వాహానదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.నగరంలోని పలు ప్రాంతాలలో భారీగా వర్షాలు పడుతున్నాయి. అయితే కూకట్‌పల్లి,దిల్‌సుఖ్ నగర్,వనస్థలిపురం,నిజాంపేట్,ప్రగతి నగర్,మూసాపేట్,కోటి తదితర ప్రాంతాలలో మాత్రం ఓ మోస్తరు వర్షం పడుతుంది. వరుసగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో నగర వాసులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. ముఖ్యంగా పాఠశాల,కళాశాల విద్యార్దులుతో పాటు ప్రభుత్వ,ప్రవేటు ఉద్యోగులు వర్షంలో రోడ్లు, రహదారులు నీటితో మునిగిపోవడంతో ప్రయాణాలు చేయలేక ఇబ్బందులు పడుతున్నారు

Read more;హైదరాబాద్ లో మళ్ళీ వర్షాలు..జనజీవనం అస్తవ్యస్థం