హైదరాబాద్‌లో భారీ వర్షాలు….పోలీసుల సూచనలు
తెలంగాణలో మళ్లీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో ఈ ఉదయం నుంచి భారీ వర్షం పడుతోంది. తెల్లవారుజామున చిరుజల్లులతో మొదలైన వాన..క్రమంగా పెరిగింది.అమీర్‌పేట,ఎస్ఆర్ నగర్,ఖైరతాబాద్,జూబ్లీహిల్స్,బంజరాహిల్స్,సోమజీగూడ,నాంపల్లి,అబిడ్స్,కోఠి,బషీర్‌బాగ్,హిమయత్‌నగర్,దిల్‌సుఖ్ నగర్,ఎల్బీనగర్,వనస్ధలిపురం,హయత్ నగర్,అబ్ధుల్లాపూర్‌మెట్,ప్రాంతాలలో మోస్తరు వర్షం కురిసింది పల్లుచోట్ల రోడ్లపై వర్షపునీరు నిలిచిపోవడంతో పాఠశాలకు వెళ్లే విద్యార్ధులు,కార్యాలయలకు వెళ్ళే ఉద్యోగులు,వాహనదారులు ఇబ్బందులు పడ్డారు
షియర్ జోన్ ప్రభావంతో నేడు,రేపు హైదరాబాద్‌లోని పలు ప్రాంతాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.భారీ వర్షసూచన ఉన్న నేపథ్యంలో ట్రాఫిక్ పోలీసులు పలు సూచనలు చేశారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. నగరంలో అక్కడక్కడ ప్రధాన రహదారులపై నీళ్లు నిలిచిపోవడం వల్ల ట్రాఫిక్ మూమెంట్ చాలా నెమ్మదిగా ఉంటోందని, చాలా చోట్ల భారీ ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడుతున్నాయని తెలిపారు..వర్షం నిలిచిన వెంటనే రోడ్లపైకి రావద్దని సూచించారు.కార్యాలయాలు,వ్యాపార,వాణిజ్య సముదాయలు,పాఠశాలలు,కళాశాలలకు వెళ్లే వారు అప్రమత్తంగా ఉండలని కోరారు.సొంత వాహనాల కంటే మెట్రో, బస్సుల్లో వెళ్లడం సేఫ్ అని తెలిపారు వర్షం నిలిచిన వెంటనే హడవిడిగా రోడ్లపైకి రాకుండా గంట తర్వాత రావాలని సూచించారు.భారీ వర్షాలతో నగరంలోని రోడ్లపైకి చేరిన నీరు బయటకు వేళ్లేందుకు గంటకు పైగా పడుతుందన్నారు.ఈ సూచనలు పాటించకపోతే ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయే అవకాశముంటుందన్నారు. ట్రాఫిక్ సమస్యలు తీర్చేందుకు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు GHMCతో కలిసి పనిచేస్తున్నాయన్నారు అధికారులు.