రైల్వే పోలీస్ కానిస్టేబుల్ పై దాడి..
యూపీలోని లక్నో చార్‌బాగ్ రైల్వే స్టేషన్ లో పోలీసులు ఆధిపత్యం చలాయిస్తున్నారు. ఓ పోలీస్ కానిస్టేబుల్ పిల్లాడిని లాఠీతో కొట్టడంతో కలకలం రేగింది. ఈ ఘటనపై ఆగ్రహించిన పిల్లాడి తల్లిదండ్రులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. వివాదం తీవ్రరూపం దాల్చడంతో కోపోద్రిక్తులైన మహిళ పోలీస్ కానిస్టేబుల్ ను చెప్పుతో కొట్టగా, దీంతో కానిస్టేబుల్ ఆమెను తోసేశారు. కానీ ఆ మహిళ కూడా వెనక్కి తగ్గకుండా చెప్పు తో నిరంతరం కొడుతూనే ఉంది. గొడవ ఆపేందుకు ఓ మహిళా పోలీసు రాగా.. ఆమెను కూడా తోసేశారు. పోలీసులు మద్యం మత్తులో ఉన్నారని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఈ వీడియో వైరల్ కావడంతో ఘటనపై పోలీసు యంత్రాంగం సీరియస్ అయింది. ఘటనపై విచారణ చేపట్టింది.

