భారత్‌లో నిరుద్యోగంపై రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు
భారత్‌లో ఉత్పత్తి రంగానికి తగిన ప్రాముఖ్యత లేదని, అందుకేభారత్, ఇతర పశ్చిమదేశాల్లో నిరుద్యోగం పెరిగిపోతోందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. అమెరికా పర్యటనలో ఉన్న రాహుల్ భారత్‌లో నిరుద్యోగంపై కీలక వ్యాఖ్యలు చేశారు. మన పొరుగుదేశం చైనా ఉత్పత్తి రంగంలో దుసుకుపోతుంటే, భారత్ మాత్రం ఉత్పత్తి రంగంపై పూర్తి శ్రద్ధ పెట్టలేదని పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా మార్కెట్‌ను చైనా ఉత్పత్తులే ముంచెత్తుతున్నాయన్నారు. ఆయన టెక్సాస్ యూనివర్సిటీలో మాట్లాడుతూ భారత్‌లో వస్తు ఉత్పాదకత పెరగవలసిన అవసరం గురించి పేర్కొన్నారు. డ్రాగన్ ఆధిపత్యాన్ని భారత్ యువత ఎదుర్కొనాలంటే ముందుగా ఉత్పత్తి రంగంలో ప్రావీణ్యత సంపాదించాలన్నారు.

