ఐఏఎస్‌లకు జీతాలు చెల్లించని ఏపీ సర్కార్
హైదరాబాద్: ఏపీలోని ఐఏఎస్ అధికారులకు సెప్టెంబర్ నెల జీతం ఇప్పటివరకు ఇవ్వలేదు. ఈ నెల 5వ తేదీ దాటినా సర్కారు జీతాలు ఇవ్వలేదు. దీంతో ఐఏఎస్‌లు గుర్రుగా ఉన్నారు. గడిచిన కొన్ని నెలలుగా ఐఏఎస్‌లకు రాష్ట్ర ప్రభుత్వం 20వ తేదీ వరకూ వేతనాలు చెల్లించని పరిస్థితి నెలకొందని ఐఏఎస్‌లు పేర్కొంటున్నారు. కన్సాలిడేటెడ్ ఫండ్ నుంచి చెల్లించాల్సిన వేతనాలు ఏపీలో నిలిపివేయడంపై ఐఏఎస్‌లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది రాజ్యాంగ విరుద్ధంగా భావిస్తున్నారు. ఈ విషయంపై ఐఏఎస్ అధికారులు కేంద్రానికి ఫిర్యాదు చేసే ఆలోచనలో ఉన్నట్టు తెలిసింది. చాలా విభాగాల ఉద్యోగులు, టీచర్లకూ సెప్టెంబర్ నెల జీతాలు ఇంకా అందలేదు.