Home Page SliderNational

రాహుల్ మైక్ కావాలనే మ్యూట్ చేశారు

లోక్‌సభ సమావేశాలలో నీట్ పేపర్ లీకేజ్ అంశం దుమారం లేవనెత్తింది. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఈ అంశం లేవనెత్తారు. ఆసమయంలో రాహుల్ మైక్ మ్యూట్ అయ్యింది. తనకు మైక్రోఫోన్ ఇవ్వాలంటూ విజ్ఞప్తి చేశారు రాహుల్. నీట్‌పై ప్రధాని మోదీ ఏమీ మాట్లాడడం లేదని రాహుల్ విమర్శించారు. ఈ విషయంపై కేంద్రం వెంటనే ప్రకటన చేయాలని దేశ యువత భవిష్యత్తుకు సంబంధించిన విషయం అని రాహుల్ డిమాండ్ చేశారు. నీట్ వివాదంపై చర్చించాలన్నారు. ఈ సమయంలో రాహుల్ గాంధీ మైక్ ఆఫ్ చేశారని, చౌకబారు పనులు చేస్తూ యువత గొంతు నొక్కుతున్నారని కాంగ్రెస్ నేతలు విమర్శిస్తున్నారు. దీనిపై స్పీకర్ ఓం బిర్లా తానెప్పుడూ ఎంపీల మైక్రోఫోన్ స్విచ్చాఫ్ చేయనని, అలాంటి కంట్రోల్స్ తన వద్ద లేవని పేర్కొన్నారు. రాష్ట్రపతి ప్రసంగంపై చర్చ జరగాల్సిన సమయంలో ఇతర విషయాలు రికార్డు కావని పేర్కొన్నారు.