Andhra PradeshNewsNews Alert

ప్రభుత్వ మిగులు ఆస్తుల అమ్మకం పై పార్లమెంట్‌లో మాగంటి ప్రశ్నలు  

Share with

దేశంలో నేషనల్ ల్యాండ్ మోనెటైజేషన్ కార్పొరేషన్ ఏర్పాటు గురించి, కేంద్ర సంస్థల మిగులు భూములు మరియు ఉపయోగంలేని భవనాల మరియు ఆస్తుల చలామణి, అమ్మకాలు ప్రక్రియ గురించి పార్లమెంట్ ప్రస్తావన వచ్చింది. 2021-22 లో అన్ని మంత్రిత్వ శాఖలు వాటిపై సాధించిన లక్ష్యం మరియు 2022-23 కు నిర్దేశించిన  లక్ష్యం – అమ్మకాల విషయాలపై ఈ సమావేశంలో చర్చలు జరిగాయి. ఈ చర్చల్లో భాగంగా ఒంగోలు పార్లమెంటు సభ్యులు, మాగుంట శ్రీనివాసులురెడ్డి ,  కేంద్ర ఆర్ధిక శాఖ సహాయక మంత్రి, గౌ. డా. భగవత్ కరాడ్‌ని ప్రశ్నిచారు. దానికి సమాధానమిస్తూ , కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉండేవిధంగా రూ.5,000 కోట్ల ప్రారంభ వాటా ధనంతోను మరియు 150 కోట్ల చెల్లింపుల వాటా ధనంతో “నేషనల్ ల్యాండ్ మోనెటైజేషన్ కార్పోరేషన్” ఏర్పాటుకు 09-03-2022 తేదీన కేంద్రం ఆమోదం తెలిపిందని కరాడ్ పేర్కొన్నారు .

అలాగే ప్రభుత్వ రంగ సంస్థలు మరియు ప్రభుత్వ సంస్థల మిగులు భూముల మరియు  ఉపయోగంలేని  భవనాల తదితర  ఆస్తుల అమ్మక/చలామణి ప్రక్రియ గురించి ఈ కార్పోరేషన్ చూస్తుందని తెలిపారు. అయితే దీనివలన ప్రభుత్వానికి గణనీయ ఆదాయం రావడం వలన ప్రైవేటు పెట్టుబడులు తగ్గడంతోపాటు క్రొత్త ఆర్ధిక  కార్యకలాపాలు   చేపట్టవచ్చని  తెలిపారు. రోడ్డు రవాణా – హైవేలు, రైల్వేలు, పవర్, ఓడరేవులు, పౌర విమానయాన, పెట్రోలియం – సహజవాయువుల తదితర మంత్రిత్వ శాఖలకు సంబంధించి 2021-22 లో ఆస్తుల అమ్మకాల వలన  ప్రభుత్వానికి   రూ.88,190 కోట్లు మరియు 2022-23 లో రూ. 1,62,422 కోట్లు వస్తాయని కార్పోరేషన్ ఊహించినదని కేంద్ర మంత్రిగారు తెలియజేశారు.