ఇటువంటి ప్రచారాలు నమ్మెద్దు.. జె. నివాస్
ఆయుష్మాన్ భారత్ కింద ఎంఎల్‌హెచ్ పి , మెడికల్ ల్యాబ్ టెక్నిషియన్ , ఫార్మాసిస్ట్ పోస్టులకు నియామకాలు చేపడుతున్నట్టు సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లుకొడుతుంది .ఈ వార్త పై స్పందించిన ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమీషనర్ , నేషనల్ హెల్త్ మిషన్ డైరెక్టర్ జె. నివాస్ మాట్లడుతూ, సోషల్ మీడియా ద్వారా జరుగుతున్న దుష్ప్రచారాలను నమ్మెద్దు అని హెచ్చరించారు.
ఉద్యోగాల నియామకానికి ఎం.డి. నేషనల్ హెల్త్ మిషన్ ఏపీ తరుపున ఎటువంటి నోటిఫికేషన్ ఇవ్వలేదన్నారు. ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఎలాంటి రిక్క్రూట్‌మెంట్ చేపట్టినా పేపర్ నోటిఫికేషన్ ద్వారా తెలియజేస్తాం అన్నారు. అప్పటి వరకు సోషల్ మీడియాలో వచ్చే ఫేక్ లెటర్లని , పోస్టలని చూసి మోసపోవద్దన్నారు. ఇటువంటి తప్పుడు ప్రచారాలు , వార్తలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్న వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. నిరుద్యోగులన్ని దృష్టిలో పెట్టుకోని కొందరు ఇటు వంటి మోసాలకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.