నువ్వు గిఫ్ట్ ఇస్తానంటే.. నేను వద్దంటానా..
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు ఖతార్ విలాసవంతమైన విమానాన్ని బహుమతిగా ప్రకటించింది. దీనిపై తాజాగా ట్రంప్ మాట్లాడుతూ.. ఇలాంటి గిఫ్ట్ ను అంగీకరించకపోవడం మూర్ఖత్వమే అవుతుందన్నారు. ‘నేను ఇలాంటి ఆఫర్ ను ఎప్పటికీ తిరస్కరించను. ఫ్రీగా ఖరీదైన విమానాన్ని ఇస్తున్నప్పుడు వద్దనడానికి నేను ఏమైనా తెలివితక్కువ వాడినా? వారు ఫ్రీగా జెట్ విమానం ఇస్తుంటే లేదు లేదు. నాకు ఫ్రీగా వద్దు. దీనికి మీకు 1 బిలియన్ డాలర్లు లేదా 400 మిలియన్ డాలర్లు చెల్లిస్తానని చెప్పాలా’ అని ట్రంప్ స్ట్రాంగ్ రిప్లై ఇచ్చారు. అనంతరం ఈ విమానాన్ని భవిష్యత్తులో అధ్యక్ష లైబ్రరీకి ప్రదర్శనకు విరాళంగా ఇస్తామన్నారు ట్రంప్.

