పుష్ప 2 అప్డేట్ వచ్చేసింది!
ప్రతిష్టాత్మక పుష్ప 2 త్వరలో బిగ్ స్క్రీన్ పై రచ్చ చేసేందుకు సిద్ధమవుతోంది. ఈ సినిమాకు సంబంధించి నిర్మాతలు కొత్త అప్డేట్ ఇచ్చారు. ఇప్పటి వరకు సెకండ్ పార్ట్ లో సగం మూవీ ఎడిటింగ్ పూర్తైనట్టుగా లీకిచ్చారు. సినిమాను డిసెంబర్ 6న రిలీజ్ చేసేందుకు సర్వం సిద్ధం చేస్తున్నామన్నారు. అనుకున్నట్టుగానే పుష్ప 2 సినిమా మొత్తం ఫైర్ అంటూ తేల్చి చెప్పారు. అల్లు అర్జున్-సుకుమార్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పుష్ప మూవీ ఫస్ట్ పార్ట్ కేవలం ఇండియాలోనే కాకుండా, ప్రపంచ వ్యాప్తంగానూ సంచలనం సృష్టించింది.

