‘పుష్ప-2’ ఎఫెక్ట్..వాయిదా పడుతున్న బాలీవుడ్ చిత్రాలు
అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న ‘పుష్ప-2 ది రూల్’ మూవీ డిసెంబర్ 5న విడుదల కానున్న సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రం కోసం దేశవ్యాప్తంగా థియేటర్లు సిద్దమవుతున్నట్లు టాక్. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన ‘పుష్ప’ చిత్రం సంచలన విజయం సాధించింది. ఇప్పుడు దీనికి సీక్వెల్‌గా ‘పుష్ప-2’ రావడంతో మిగిలిన సినిమాలు వాయిదా వేయాలని ప్లాన్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. బాలీవుడ్ కూడా హిందీ సినిమాలను ఆ వారంలో విడుదల చేయకూడదని నిర్ణయించినట్లు సమాచారం. విక్కీ కౌశల్ హీరోగా తెరకెక్కిన హిస్టారికల్ మూవీ ‘ఛావా’ను తొలుత డిసెంబర్ 6న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు కానీ, పుష్ప 2 రిలీజ్ కానుండడంతో ఆ ప్రయత్నాన్ని వాయిదా వేస్తున్నారు. ‘పుష్ప-2’ కోసం ప్రపంచ వ్యాప్తంగా 11500 థియేటర్లు సిద్దమవుతున్నట్లు సమాచారం. అందుకే మరో సినిమాకు థియేటర్లు దొరకవు. నవంబర్ 15న ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరగబోతోంది. దేశవ్యాప్తంగా ముంబై, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, పాట్నా, కొచ్చిలలో మూవీ టీం ప్రచార పర్యటనను ప్లాన్ చేసింది.

