మునుగోడులో మంత్రి మల్లారెడ్డికి నిరసన సెగ
మునుగోడు నియోజకవర్గంలో కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డికి నిరసన సెగ తగిలింది. చౌటుప్పల్ ఆరె గూడెంలో ఎన్నికల ప్రచారానికి వెళ్లిన మల్లారెడ్డిని గౌడ కులస్తులు అడ్డుకున్నారు. కాటమయ్య ఆలయం కోసం 12 లక్షలు ఇస్తామని మంత్రి ఒప్పుకున్నారు. అయితే 2 లక్షలు మాత్రమే ఇచ్చారని మండిపడ్డారు. మిగతా 10లక్షలు కూడా ఇవ్వాలని గౌడ సంఘం నాయకులు డిమాండ్ చేశారు. ఎన్నికల తర్వాత ఎవరు రారంటూ నిలదీశారు. గౌడ సంఘ నాయకులు మంత్రిని నిలదీశారు. మరోవైపు యాదవ, వడ్డెర సంఘాలకు కూడా ఆలయాల నిర్మాణాల కోసం డబ్బులు ఇస్తామని మంత్రి మల్లారెడ్డి హామీ ఇచ్చినట్లు స్థానికులు పేర్కొంటున్నారు.

