Home Page SliderNationalNewsPolitics

ఎంపీగా ప్రియాంక ప్రమాణ స్వీకారం

తొలి ప్రయత్నంలోనే వయనాడ్ నుండి 4 లక్షలకు పైగా భారీ ఓట్ల తేడాతో గెలుపొందిన ప్రియాంక గాంధీ నేడు లోక్‌సభలో ప్రమాణస్వీకారం చేశారు. తల్లి సోనియా గాంధీతో కలిసి పార్లమెంట్‌లో అడుగు పెట్టారు ప్రియాంక. ఒకే కుటుంబానికి చెందిన సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ముగ్గురూ కాంగ్రెస్ ఎంపీలుగా ఉండడం విశేషం. సోనియా గాంధీ రాజ్యసభ నుండి ఎంపీగా ఉండగా, రాహుల్, ప్రియాంకలు లోక్‌సభ నుండి ఎంపీలుగా ఉన్నారు. ముమ్మారులా ఆమె నానమ్మ, మాజీ ప్రధాని దివంగత  ఇందిరాగాంధీని తలపించే తలకట్టు, చేనేత చీరతో సభ్యులను ఆకట్టుకున్నారు.