Home Page SliderTelangana

హైదరాబాద్‌కు రానున్న ప్రియాంకగాంధీ

మే మొదటివారంలో కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంకగాంధీ హైదరాబాద్ వస్తారని టీపీసీసీ తెలంగాణా అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తెలిపారు. మే 4 లేదా 5 వతేదీన సరూర్ నగర్‌లో నిర్వహించే నిరుద్యోగసభలో ఆమె పాల్గొంటారని తెలియజేశారు. శ్రీకాంతాచారి విగ్రహానికి నివాళులర్పిస్తారని పేర్కొన్నారు. తెలంగాణా వ్యాప్తంగా అన్ని జిల్లాలలో కాంగ్రెస్ పార్టీ  నిరుద్యోగ నిరసన సభలు, ర్యాలీలు ఏర్పాటు చేస్తున్నామన్నారు రేవంత్ రెడ్డి. ఈ సందర్భంగానే ప్రియాంకగాంధీ హైదరాబాదుకు వస్తున్నారని తెలియజేసారు. నిరుద్యోగుల విషయంలో ప్రభుత్వతీరుకు నిరసనగా ఈ ఉద్యమాలను చేపడుతున్నామని, ఏప్రిల్ 21న నల్గొండలో, 24 ఖమ్మంలో,26 ఆదిలాబాద్ జిల్లాలో సభలు నిర్వహిస్తున్నామన్నారు. మే 9 వతేదీ నుండి రెండవ విడత ‘హాత్ సే హాత్ జోడో’ యాత్రను జోగులాంబ జిల్లా నుండి ప్రారభిస్తున్నామన్నారు.