ప్రియాంక చోప్రా వినయం అదుర్స్.. ఓ పాకిస్తానీ
సినిమా జనమంటే సాధారణ ప్రేక్షకులే కాదు… వీఐపీలైనా పడి చస్తారు. ఇక బాలీవుడ్ తారలకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ఉంది. మరీ ముఖ్యంగా… ఇండియన్ తారలకు పాకిస్తాన్ లో భారీగా ఫ్యాన్స్ ఉన్నారని చెప్పడం ఎంత మాత్రం అతిశయోక్తి కాదు. హిందీ సినిమాలు పాకిస్తాన్‌లో ఎంతో ప్రాచుర్యం పొందుతున్నాయ్. క్రికెట్ తర్వాత పాకిస్తానీయులు హిందీ సినిమాలంటే ఎక్కువ ఆసక్తి కనబరుస్తారు. ముఖ్యంగా పాకిస్తాన్ రాజకీయ నేతలు, క్రెకిట్ తారలు, సాధారణ ప్రజలు సైతం హిందీ సినిమా యాక్టర్లంటే పడి చస్తారు. ఇక సినీ తారలను కలవడమంటే వారికి పండగే. అలాంటి అవకాశం పాకిస్తాన్ జర్నలిస్ట్ మల్లిక్‌కు లభించింది.
న్యూయార్క్‌లోని ఓ హోటల్‌లో పాకిస్తాన్ జర్నలిస్టు అనాస్ మల్లిక్.. నటి ప్రియాంక చోప్రాను కలవడంతో ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. ప్రియాంక చోప్రాతో దిగిన ఫోటోను ట్విట్టర్లో షేర్ చేసి ఆనందం పొందుతున్నారు. న్యూయార్క్‌లోని హోటల్ లాబీలో నేను నిజంగా ప్రియాంక చోప్రాతో సెల్ఫీ తీసుకున్నా.. ఆమె నా పట్ల ఎంతో వినయపూర్వకంగా ఉన్నారని రాసుకొచ్చారు. మాజీ ప్రపంచ సుందరి ప్రియాంక చోప్రా జర్నలిస్టు పట్ల చూపిన ఔదార్యం నెటిజెన్లను ఫిదా చేస్తోంది. మల్లిక్ చాలా సంవత్సరాలుగా ఫీల్డ్ రిపోర్టర్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం WION అనే ఇండియన్ న్యూస్ చెనెల్‌కు బ్యూరో చీఫ్‌గా వ్యవరిస్తున్నారు.

