యుద్ధానికి సిద్ధం కండి.. పోరాడండి.. గెలవండి.. సైనికులకు చైనా అధ్యక్షుడి సందేశం
జాతీయ భద్రత పెరిగిన అస్థిరతను ఎదుర్కొంటుందని చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్ అన్నారు. రికార్డు స్థాయిలో మూడో ఐదేళ్ల పదవీకాలం కోసం సైన్యం బాధ్యతలు స్వీకరించినందున, తన సామర్థ్యాన్ని పెంపొందించడానికి… యుద్ధంలో పోరాడటానికి గెలవడానికి సంసిద్ధతను కొనసాగించడానికి PLA తన శక్తులన్నింటినీ కూడదీసుకోవాలని ఆదేశించారు. పాలక కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా CPC జనరల్ సెక్రటరీగా, సెంట్రల్ మిలిటరీ కమిషన్ CMC అధిపతిగా తిరిగి నియమించబడ్డ సందర్భంగా జీజిన్పింగ్ ఈ వ్యాఖ్యలు చేశారు. పార్టీ అధిపతి, మిలటరీ, ప్రెసిడెన్సీ మూడు శక్తివంతమైన పదవులను కలిగి ఉన్న జీజిన్పింగ్ పార్టీ వ్యవస్థాపకుడు మావో జెడాంగ్‌తో పాటు 10 సంవత్సరాల పదవీకాలం పూర్తయిన తర్వాత అధికారంలో కొనసాగిన ఏకైక నాయకుడుగా చరిత్ర సృష్టించాడు. CMC జాయింట్ ఆపరేషన్స్ కమాండ్ సెంటర్‌ను పరిశీలించిన అధ్యక్షుడు… CPC సెంట్రల్ కమిటీ, CMC వ్యూహాత్మక కమాండ్‌కు కీలకమైన మద్దతును అందిస్తోందన్నారు.

CMC అధిపతిగా మూడోసారి పదవిని ప్రారంభించిన సందర్భంగా, రెండు మిలియన్ల మంది సైనికులను ఉద్దేశించి తన మొదటి ప్రసంగంలో, జీజిన్పింగ్ మాట్లాడారు. ప్రపంచం ఒక శతాబ్దంలో కనపడని అత్యంత లోతైన మార్పులకు లోనవుతుందని… చైనా జాతీయ భద్రత పెరిగిన అస్థిరత, అనిశ్చితిని ఎదుర్కొంటోందని.. సైనికులపై పెద్ద బాధ్యతలు ఉన్నాయన్నారు. పోరాట సంసిద్ధత కోసం, పోరాడి గెలిచే సామర్థ్యాన్ని పెంపొందించుకోవడానికి, సైన్యం సిద్ధంగా ఉండాలన్నారు. జాతీయ సార్వభౌమాధికారం, భద్రత, అభివృద్ధి ప్రయోజనాలను దృఢంగా కాపాడాలని, పార్టీ, ప్రజలు అప్పగించిన వివిధ పనులను విజయవంతంగా పూర్తి చేయాలని వారికి సూచించారు. PLA శతాబ్ది లక్ష్యాన్ని సాకారం చేయడంపై సైనిక నాయకత్వం తప్పనిసరిగా దృష్టి సారించాలన్నారు. PLAని 2027 నాటికి ప్రపంచ స్థాయి సాయుధ దళంగా మార్చడంపై దృష్టిసారించాలన్నారు. US సాయుధ దళాలతో సమానంగా PLA రూపాంతరం చెందాలన్నారు. అందుకు చేయాల్సిన అన్ని ప్రయత్నాలు చేయాలన్నారు. సైనిక దళాలను బలోపేతం చేస్తామన్నారు. సంక్షోభాలు, సంఘర్షణలను దీటుగా ఎదుర్కొంటే… గెలుపు చైనాదే అవుతుందన్నారు.

