Home Page SliderNational

మరోసారి తల్లి కాబోతున్న ప్రణీత సుభాష్

టాలీవుడ్‌లో ప‌లు సినిమాల్లో నటించిన ప్ర‌ణీత సుభాష్ త‌న‌కంటూ మంచి గుర్తింపును తెచ్చుకుంది. ప‌వ‌న్ క‌ళ్యాణ్ న‌టించిన ‘అత్తారింటికి దారేది’ మూవీలో మంచి రోల్‌లో న‌టించి తెలుగు ప్రేక్ష‌కుల‌కు ద‌గ్గ‌ర‌య్యింది. ఇక ఈ బ్యూటీ తాజాగా రెండోసారి త‌ల్లికాబోతున్న‌ట్లు ప్ర‌క‌టించింది. బేబీ బంప్‌తో ఉన్న ఫోటోల‌ను త‌న ఇన్‌స్టాలో పోస్ట్ చేసి ఈ గుడ్ న్యూస్‌ను అభిమానుల‌తో పంచుకుంది.
రౌండ్ 2.. ఇక నుంచి ప్యాంట్లు స‌రిపోవు అంటూ త‌న ప్రెగ్నెన్సీ విష‌యాన్ని సంతోషంగా తెలిపింది. 2021లో వ్యాపార‌వేత్త నితిన్ రాజును వివాహ‌మాడిన ప్ర‌ణీత‌, 2022లో ఓ ఆడ‌బిడ్డకు జ‌న్మ‌నిచ్చింది. ఇప్పుడు మ‌రోసారి త‌ల్లి కాబోతుండ‌టంతో తాను సంతోషంగా ఉన్న‌ట్లుగా తెలిపింది.
ఇటీవ‌ల త‌మిళ‌, క‌న్న‌డ సినిమాల్లో రెండో ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది ప్ర‌ణీత. ప్ర‌స్తుతం ప్ర‌ణీత సుభాష్ బేబీ బంప్ ఫోటోలు నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి.