NewsTelangana

టీఆర్ఎస్ పార్టీకి ప్రదీప్ రావు రాజీనామా

Share with

టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత ఎర్రబెల్లి ప్రదీప్ రావు ఆ పార్టీకి రాజీనామా ప్రకటించారు. మీడియా సమావేశం ఏర్పాటు చేసిన ప్రదీప్ రావు బంగారు తెలంగాణ కోసం జీవితాన్ని ధారోపోశానన్నారు. పార్టీ గెలుపు కోసం గడపగడపకు తిరిగానన్నారు. టీఆర్ఎస్ పార్టీ కోసం కేసులను సైతం ఎదుర్కొన్నానన్నారు. పార్టీలోని కొందరు నేతలు… ఎంత అవమానించినా.. ప్రత్యేక రాష్ట్రం కోసం ఓపిగ్గా భరించానన్నారు. ప్రజల్లోకి వెళ్లి… ఎవరి సత్తా ఏంటో తేల్చుకుంటామంటూ ఆయన టీఆర్ఎస్ నేతలకు సవాల్ విసిరారు. ఎవరైనా తనతో పోటీకి వస్తే తాను పోటీకి సిద్ధమన్నారు. ఎన్నికల్లో ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానన్నారు. 50 ఏళ్ల వేడుకలో ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలను టీఆర్ఎస్ హైకమాండ్ ఖండించకపోవడం దారుణమన్నారు. వచ్చే ఎన్నికల్లో వరంగల్ తూర్పు నుంచి బరిలోకి దిగుతానన్నారు. ఏ పార్టీ ఆదరించకపోయినా… స్వతంత్ర అభ్యర్థిగానైనా పోటీ చేస్తానన్నారు ప్రదీప్ రావు.