NewsTelangana

కేసీఆర్‌కు ఆ మాత్రం తెలివి లేదా?

Share with

సీఎం కేసీఆర్ నీతి ఆయోగ్ సమావేశంలో పాల్గొనకపోవడం దారుణమన్నారు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్. కేసీఆర్‎కు నీతి ఆయోగ్ గురించి పూర్తిగా తెలియకపోవడం… అవగాహన లేకపోవడం వల్లే సమావేశానికి హాజరు కాకుండా ఉండి ఉంటారన్నారు. మమత బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్ ప్రధానితో విభేదించినా నీతి ఆయోగ్ సమావేశంలో పాల్గొన్నారన్నారు. నితీష్ కుమార్ లాంటి ముఖ్యంత్రులు సమావేశంలో పాల్గొని దేశానికి దిశా నిర్దేశం చేస్తున్నారన్నారు. కేసీఆర్ కల్వకుంట్ల రాజ్యాంగం పాటిస్తున్నందున సమావేశంలో పాల్గొనలేదన్నారు. కేసీఆర్ కేబినెట్‌లో మంత్రులు ఎప్పుడైనా మాట్లాడారా? విధాన నిర్ణయాల్లో భాగస్వాములయ్యారా అని ప్రశ్నించారు. తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన నిధులు వాడుకోలేదని నీతి ఆయోగ్ స్పష్టం చేసిందని… కార్పొరేషన్ ద్వారా రుణాలు తెచ్చి ఏం చేశారని ప్రశ్నించారు. నీతి ఆయోగ్ దేశంలోని అన్ని రాష్ట్రాలను సమానదృష్టితో చూస్తుందన్నారు.