Andhra PradeshNews

పాపం మూగ జీవాలు.. వాడికి చెయ్యెలా వచ్చిందో?

కర్నూలు జిల్లాలో దారుణం జరిగింది. గుర్తు తెలియని సైకో మూగజీవాలపై దాడి చేసి, వాటి ఉసురు పోసుకుంటున్నాడు. కర్నూలు జిల్లా గోనెగండ్లలో రాత్రి వేళలో ఇంటి పెరట్లో కట్టేసిన పశువులు రక్తపు మడుగులో పడి ఉంటున్నాయి. కనిపించిన ఆవులు, ఎద్దులు, మేకలపై దాడి చేసి, వాటిని కత్తితో గాయపరుస్తూ ఆనందం పొందుతున్నాడు సైకో. దీనితో రైతులు భయపడి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పశువుల యజమానులు ఆ సైకోను తీవ్రంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. సైకోలు మూగజీవులపై దాడి చేయడానికి చెయ్యెలా వచ్చిందో? అంటూ శాపనార్థాలు పెడుతున్నారు. ఈ పనులు ఎవరు చేశారు?. ఉద్దేశపూర్వకంగా కక్ష సాధించడానికి చేస్తున్నారా? అనేది దర్యాప్తు చేస్తున్నారు.