Home Page SlidermoviesNationalNews Alert

సైఫ్‌పై దాడి కేసులో పోలీసుల అనుమానాలు

బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్‌పై దుండగుడి దాడి కేసులో ఆయన వాంగ్మూలం రికార్డు చేశారు పోలీసులు. ఈ వాంగ్మూలంలో ఆయన తెల్లవారుజామున 2.30 గంటల సమయంలో దాడి జరిగినట్లు పేర్కొన్నారు. అయితే లీలావతి ఆసుపత్రిలో తెల్లవారుజామున 4.11 గంటలకు చేరినట్లుగా వైద్యులు నివేదిక విడుదల చేశారు. ఇంటి నుండి ఆసుపత్రికి 15 నిమిషాలు సమయం మాత్రమే పడుతుంది. ఇంత ఆలస్యం ఎందుకయ్యిందనే విషయంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సైఫ్ పేర్కొన్న ప్రకారం ఆయన భార్య కరీనాతో వారి గదిలో ఉండగా చిన్నకుమారుడు జెహ్ గదిలో నుండి కేర్ టేకర్ అరుపులు వినిపించాయి. సైఫ్ ఆ రూమ్‌లోకి వెళ్లగానే దుండగుడిని చూసి పట్టుకోవడానికి ప్రయత్నించగా అతడు దాడి చేసి పారిపోయాడు. అతని పెద్ద కుమారుడు, ఆటోడ్రైవర్ కలిసి అతడిని ఆసుపత్రిలో చేర్చినట్లు వార్తలు వచ్చాయి. కానీ ఆసుపత్రి రిపోర్టులో సైఫ్ మేనేజర్, స్నేహితుడు కలిపి ఆసుపత్రిలో చేర్చినట్లు రాశారు. ఈ విషయంపై పలువురిని ప్రశ్నించే అవకాశం ఉంది. అయితే బంగ్లాదేశ్‌కు చెందిన ప్రధాన నిందితుడు మహ్మద్ షరీఫుల్‌ని ఇప్పటికే పోలీసులు అరెస్టు చేశారు.