Andhra PradeshHome Page Slider

వైసీపీ ఎమ్మెల్సీ ఇసాక్ పై పోలీస్ కేసు

వైసీపీకి చెందిన ఎమ్మెల్సీ ఇసాక్ పై నంద్యాల వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. కోర్టు ఆదేశాల మేరకు ఎమ్మెల్సీ ఇసాక్ తో పాటు మరో నలుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. మసీదు నిధుల విషయంలో ఇసాక్ అవకతవకలకు పాల్పడినట్లు బాధితుడు సలాం కోర్టును ఆశ్రయించారు. విచారించిన కోర్టు వారిపై కేసు నమోదు చేయాలని ఆదేశాలు ఇచ్చింది. దీంతో ఎమ్మెల్సీ ఇసాక్, మిగిలిన వారిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.