Andhra PradeshHome Page Sliderhome page slider

అమాయక దళిత, మైనారిటీల యువకులపై పోలీసుల జులుం

అమాయక దళిత, మైనారిటీల యువకులపై తెనాలి ఐతానగర్ నడిరోడ్డుపై అందరూ చూస్తుండగా పోలీసులు తమ ప్రతాపాన్ని ప్రదర్శించారు. ఆలస్యంగా ఆధారాలతో వీడియో వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. కన్నా చిరంజీవి తెనాలి 3 టౌన్ పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా పనిచేస్తున్నాడు. అతనికి 2 టౌన్ కి సంబంధం లేదు. పోలీసు కానిస్టేబుల్ PC: 6068 కన్నా చిరంజీవి 2 టౌన్ పరిధిలోకి వచ్చి ఈ యువకులను డబ్బులు ఇవ్వమని లేకపోతే మీ మీద అక్రమ కేసులు, గంజాయి కేసులు పెడతామని 3 టౌన్ CI రమేష్ బాబు చెప్పమన్నారని బెదిరించగా వాళ్ళు డబ్బులు ఇవ్వమని తిరస్కరించగా అందుకు ఆక్రోశించిన కానిస్టేబుల్ కన్నా చిరంజీవి ఎక్కడ అతని యొక్క అవినీతి బయటకు వస్తుందేమోనని ముందుగానే వెళ్లి అమాయక యువకులపై అబద్ధపు కేసు పెట్టారు. ఈ విధంగా 2 టౌన్ నకు సంబంధం లేని 3 టౌన్ కానిస్టేబుల్స్ బెదిరింపులకు పాల్పడ్డాడు.

Cr.No: 52/2025 గా నమోదు చేసి 3 రోజులు వారి వద్దే ఉంచుకుని చిత్రహింసలకు గురిచేశారు. ది. 25-04-2025 నే ముద్దాయిలను అరెస్టు చేసి అక్రమంగా నిర్బంధించి విచక్షణారహితంగా కొట్టి వీధి వీదులు తిప్పుతూ తెనాలి, ఐతానగర్ ప్రధాన కూడళ్ళలో రోడ్డులపై కూర్చోబెట్టి బహిరంగ ప్రదేశాలలో ప్రజలు చూస్తుండంగా విచక్షణారహితంగా తెనాలి 2 టౌన్ రాముల నాయక్ మరియు 3 టౌన్ CI రమేష్ బాబులు దాష్టీకం ప్రదర్శించారు. చేబ్రోలు జాన్ విక్టర్ S/O ఇజ్రాయెల్, 25 సంవత్సరాలు, మాల, చెంచుపేట, తెనాలి టౌన్, గుంటూరు జిల్లా. షేక్ బాబులాల్ @ కరిముల్లా @ కల్లా S/O అమీర్ భాషా, 21 సంవత్సరాలు, ముస్లిమ్, తిప్పర్ల బజార్ మంగళగిరి, గుంటూరు జిల్లా. దోమా రాకేష్ S/O వాసు, 25 సంవత్సరాలు, మాల ఐతానగర్, తెనాలి టౌన్, గుంటూరు జిల్లా. అను వారలపై, వీరు ఇద్దరు మాల కులం, ఒకరు ముస్లిమ్ కమ్యూనిటీకి చెందిన యువకులపై తెనాలి 2 టౌన్ CI రాములు నాయక్ మరియు 3 టౌన్ CI రమేష్ బాబు లు అతిక్రూరంగా బహిరంగంగా రోడ్లు మీదకు తీసుకొచ్చి విచక్షణారహితంగా కొట్టారు.

దోమ రాకేష్ అను అతనికి చేతులలో కాళ్ళలో రాడ్లు ఉన్నాయని చెప్పి కాళ్లు పట్టుకుని ప్రాధేయపడినా 2 టౌన్ CI రాములు నాయక్ అతి కర్కశంగా అతని కాళ్ళపై ఎక్కి తొక్కి పెట్టగా 3 టౌన్ CI రమేష్ బాబు అతికిరాతకంగా అతనికి అలుపు వచ్చే వరకు విచక్షణారహితంగా కొట్టారు. పోలీసు స్టేషన్ లో ముద్దాయిలను కొడతారని చంపుతారని తెలుసుగాని ఈ విధంగా బహిరంగంగా అందరూ చూస్తూ ఉండగా రోడ్ల మీదకు తీసుకొచ్చి వాళ్ళ యొక్క పోలీసు దాష్టీకం ప్రదర్శించి చుట్టుప్రక్కల ప్రజలను భయభ్రాంతులకు గురి చేశారు. నేరం చేస్తే న్యాయస్థానాలకు అప్పచెప్పాలి గాని, ఇంత క్రూరంగా ప్రజలు చూస్తూ ఉండగా కొట్టాల్సిన అవసరం లేదు. గౌరవ న్యాయస్థానాలు ముద్దాయిలను ఈ విధంగా శిక్షించవద్దు. ఈ విధంగా కొట్టవద్దు. ప్రజలపై తెనాలి పోలీసులు ఉక్కు పాదం మోపుతున్నారు.

ఈ విషయం మీద తల్లిదండ్రులు వెళ్ళి మాట్లాడితే ఇంకా వారికి సంబంధించిన వ్యక్తులు వెళ్ళి మాట్లాడినా మీపైన కూడా కేసులు పెడతామని వాపోతున్నారు. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం అండదండలు చూసుకుని పోలీసులు జులుం చూపిస్తున్నారు. ఈ విధమైన దాష్టీకం కేవలం దళితుల మీదే చూపిస్తున్నారు. 2 టౌన్ CI రాముల నాయక్ ఐతానగర్ కు చెందిన వారిపైనే ఎక్కువగా దృష్టి సారించారు. అమాయకపు వ్యక్తులపై అబద్ధపు మరియు అక్రమ కేసులు బనాయించి ఈ విధంగా కర్కశత్వం చూపిస్తున్నారు. ఇప్పటికైనా పోలీసులు మీ పైఅధికారుల మరియు రాజకీయ నాయకుల మెప్పులు పొందడానికి అమాయకమైన దళిత, మైనారిటీలపై జులుం చూపిస్తున్నారు.