నెహ్రూకు ప్రధాని మోదీ నివాళి
భారత తొలి ప్రధాని పండిత జవహర్‌లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా ప్రధాని మోదీ నివాళులర్పించారు. స్వాతంత్య్ర భారత దేశాన్ని ఆధునికత వైపు నడిపించడంలో ఆయన ఎంతో కృషి చేశారని కొనియాడారు. నెహ్రూను ఆధునిక భారత పిత, ఇనిస్టిట్యూట్ల సృష్టికర్తకు గౌరవనీయ వందనాలని తన ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేశారు. ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, ప్రియాంక గాంధీ తదితరులు కూడా నెహ్రూకు నివాళులర్పిచారు. మీ ప్రజాస్వామిక ప్రగతిశీలమైన సమ్మిళిత విలువలను దేశం ఎన్నటికీ మరిచిపోదని రాహుల్ గాంధీ పేర్కొన్నారు.

