Horoscope TodayNews

ఈ రాశివారికి అటెన్షన్ ప్లీజ్.. కొంచెం జాగ్రత్త తప్పదు మరి..!

సెప్టెంబర్ 18, దిన ఫలాలు :

మేషం : ఉద్యోగంలో పై అధికారులతో నమ్రతగా వ్యవహరించాలి. గిట్టనివారు మీ ఉత్సాహంపై నీళ్లు చల్లుతారు. మనోవిచారం కలిగించే సంఘటనలకు దూరంగా ఉండాలి. కొన్ని సమస్యలు పరిష్కారమవుతాయి. వ్యాపార పెట్టుబడి రంగాలలో అంచనాలు తప్పుతాయి. పనుల్లో జాప్యం ఆర్థిక లావాదేవీలు నిరాశ పరుస్తాయి. వ్యాపారంలో ఒడిదుడుకులు ఉద్యోగులకు అనుకోని మార్పులు విద్యార్థుల ప్రయత్నాలు విఫలం కావచ్చు. విష్ణు సహస్రనామం పారాయణం చేయడం వలన వీటి నుంచి బయటపడవచ్చు.

వృషభం : చేపట్టే పనులకు ఆటంకాలు ఎదురవకుండా చూసుకోవాలి. మీ అభివృద్ధికి దోహదపడే ఒక కీలక నిర్ణయం తీసుకుంటారు. అకారణ కలహ సూచన. కుటుంబంలో చిన్నపాటి సమస్యలు వస్తాయి. ఆర్థిక ఇబ్బందులు సవాలు చేస్తూ ఉంటాయి పనుల్లో అవాంతరాలు బంధువులతో విరోధం అంచనాలు తప్పుతాయి. దేవాలయ సందర్శన లేదా ఇష్ట దైవ ఆరాధన శుభసూచకం.

మిధునం : లక్ష్యాలకు కట్టుబడి పనిచేస్తారు. ధర్మ సందేహాలతో కాలాన్ని వృథా చేయకండి. కుటుంబ సభ్యులతో ఆచితూచి వ్యవహరించాలి. మనోవిచారం కలగకుండా చూసుకోవాలి. ప్రయాణంలో ఆటంకాలు కలుగుతాయి. చేపట్టే పనుల్లో పట్టుదల వదలకండి. అనారోగ్య సమస్యలు తీవ్ర ఇబ్బందులు పెడతాయి. వ్యాపారస్తులకు నిరాశ. విద్యార్థులకు శుభ ఘడియలు. ప్రముఖులతో పరిచయాలు.

కర్కాటకం : ఆదాయం మరింత పెరుగుతుంది. సోదరులు లేదా కుటుంబ సభ్యుల నుంచి ఆహ్వానాలు తలపెట్టిన కార్యాల్లో విజయసిద్ధి ఉంది. ఒక శుభవార్త ఉత్సాహాన్నిస్తుంది. విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. తోటివారి సహాయ సహకారాలు లభిస్తాయి. దైవబలం రక్షిస్తోంది. శివ స్తోత్రాలు పఠించండి.

సింహం : ఉద్యోగ ప్రయత్నాలలో శుభప్రదమైన కాలాన్ని గడుపుతారు. బాధ్యతలను సమర్థవంతంగా పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యుల సలహాలతో విజయాలు సాధిస్తారు.కుటుంబ సమస్యల నుంచి బయటపడతారు వ్యాపారులకు మరింత పురోగతి ఉద్యోగులకు చిక్కులు తొలగుతాయి. విద్యార్థులకు ఈ దినం చాలా అనుకూలం. రాబడి అనేది మరింత ఉత్సాహాన్ని ఇస్తుంది.

కన్య : సమన్వయ లోపం లేకుండా చూసుకోవాలి. సమర్థతను పెంచాలి. ఆవేశంలో నిర్ణయాలు తీసుకోవద్దు. ప్రశాంతమైన ఆలోచనలతో గొప్పవారవుతారు. ఆత్మీయులతో విభేదాలు రాకుండా చూసుకోవాలి. రెట్టించిన ఉత్సాహంతో పనిచేయాలి. దంపతుల మధ్య సమస్యలు సృష్టించేవారు ఉండవచ్చు. పెట్టుబడులు చేరవచ్చు. ఉద్యోగాలలో పని భారంతో సతమతమయ్యే గణపతి స్తోత్రాలు పఠించండి.

తుల : కొత్త పనులు చేపడతారు కానీ అంత అనుకూలంగా ఉండకపోవచ్చు రాబడిలో అంత అభివృద్ధి లేదు ప్రయాణాలు ఆకస్మికంగా ఉంటాయి. శారీరక రుగ్మతలు కొంత నష్టం పెట్టవచ్చు బంధువులతో తగాదాలు. తోటివారిని కలుపుకుపోవడం ద్వారా శీఘ్ర ఫలితాలు సొంతమవుతాయి. ఉత్సాహంతో ముందుకు సాగి గొప్ప ఫలితాలను అందుకుంటారు. ఇష్ట దైవారాధన వలన మానసిక శాంతి.

వృశ్చికం : నేడు ఏ పని లేదా కార్యక్రమం మొదలుపెట్టిన శుభకాలం. బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తారు. ఒక వ్యవహారంలో అధికారుల మన్ననలు పొందుతారు. ప్రయాణ సౌఖ్యం కలదు. వ్యాపారస్తులు అయితే లాభాలలో ఉద్యోగస్తులైతే ప్రమోషన్లు బంధువులతో మరింత ఉత్సాహంగా గడుపుతారు.

ధనుస్సు : కుటుంబ సభ్యులతో తగాదాలు దూర ప్రయాణాల వలన చికాకులు కష్టానికి తగిన ఫలితాలు సొంతమవుతాయి. నూతన కార్యక్రమాలను మొదలుపెట్టే ముందు లాభ నష్టాలను అంచనా వేసుకొని ముందుకు సాగండి. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. రాబడి అంత ఆశాజనకంగా ఉండదు. ప్రయాణాలు ఫలిస్తాయి. ఉద్యోగస్తులకు ఒడిదుడుకులు. సుబ్రహ్మణ్య అష్టోత్తర శతనామావళి పఠిస్తే బాగుంటుంది.

మకర రాశి : పరిపూర్ణమైన ఆత్మవిశ్వాసంతో పనిచేయాలి. వ్యయప్రయాసలు అధికం అలసట పెరగకుండా ముందుచూపుతో వ్యవహరించాలి. నిర్ణయాలు తీసుకోవడంలో ఇబ్బందిపడతారు. ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోకపోవడమే మంచిది. ప్రయాణాలలో ఆటంకాలు. ఆరోగ్యపరమైన సమస్యలు రావచ్చు. పనులు లేదా కార్యక్రమాలలో ఆటంకాలు. పెట్టుబడిదారులకు లేదా వ్యాపారస్తులకు ఒడిదుడుకులు. శ్రీ వెంకటేశ్వర స్వామి సందర్శనం ఉత్తమం

కుంభం : ఆకస్మిక ధన లాభం ఉండవచ్చు. ఆత్మీయుల సహకారంతో అనుకున్నది సాధిస్తారు. స్థిరమైన భవిష్యత్తు కోసం ఆలోచనలు చేస్తారు. మీ మీ రంగాల్లో మంచి ఫలితాలను అందుకుంటారు. తద్వారా సంఘంలో గౌరవం పెరుగుతుంది. కొత్త వ్యాపారాలు లేదా ఉద్యోగాలకు శ్రీకారం. మహిళలకు పుట్టింటి నుండి సహాయ సహకారాలు అందుతాయి. నవగ్రహ శ్లోకాలు చదవాలి.

మీనం : కొత్త కార్యక్రమాలు ప్రారంభించటం వల్ల పనుల్లో ఆటంకాలు పెరుగుతాయి. పట్టుదలతో అనుకున్నది సాధిస్తారు. తోటివారిని కలుపుకుపోతే పనులు త్వరగా పూర్తవుతాయి. ఒత్తిడి పెరగకుండా చూసుకోవాలి. మొహమాటంతో ఖర్చులు పెరుగుతాయి. దీర్ఘకాలిక సమస్యలు తొలగిపోతాయి. పది మందిలో కూడా గుర్తింపు వస్తుంది. దాంపత్య సమస్యలు తలెత్తకుండా చూసుకోండి. మహిళలకు ఆహ్వానాలు లభిస్తాయి. దైవారాధన మానవద్దు.