గ్రానైట్ కార్మికులకు PF ఇవ్వాలని ధర్నా
చీమకుర్తి గ్రానైట్‌లో పనిచేస్తున్న పీఎఫ్ ఇవ్వాలని కోరుతూ సీఐటీయూ ఆధ్వర్యంలో ధర్నా కార్మికులు ధర్నాకు దిగారు. ఈ ధర్నాను గుంటూరు ప్రాంతీయ కార్యలయం వద్ద నిర్వహించారు. దీనిలో భాగంగా కార్మికులు తమ డిమాండ్‌లను తెలియజేస్తూ రీజనల్ అధికారికి వినతిపత్రాన్ని ఇచ్చారు. ఈ సందర్భంగా సీఐటీయూ నాయకులు బి. లక్ష్మణరావు మాట్లాడుతూ గత 10 సంవత్సరాలుగా గ్రానైట్ సంస్ధలు లాభాల్లో నడుస్తున్నప్పుడు అక్కడ పనిచేసే కార్మికులకు పీఎఫ్ ఎందుకు ఇవ్వరని ప్రశ్నించారు.

