అయ్యప్ప ప్రసాదంలో పెస్టిసైడ్స్
దేశవ్యాప్తంగా భక్తులు మహా ప్రసాదంగా భావించే శబరిమలై అయ్యప్ప స్వామి అరవణ ప్రసాదంలో పెస్టిసైడ్స్ ఉన్నాయంటూ ల్యాబ్ రిపోర్టులు తేల్చిచెప్పాయి. ఈ ప్రసాదంలో 14 రకాల విషపూరిత క్రిమిసంహారక మందులు ఉన్నాయని పేర్కొంది. ఈ విషయంగా 2023 జనవరిలోనే కేరళ హైకోర్టులో పిటిషన్ దాఖలయ్యింది. దీనిపై విచారించిన కోర్టు అరవణ ప్రసాదాన్ని వినియోగించరాదని తీర్పు చెప్పింది. దీనిని ఎవరికీ పంపిణీ చేయకుండా చూడాలని శబరిమలై ఫుడ్ ఇన్స్‌పెక్టర్‌ను హైకోర్టు ఆదేశించింది. దీని తయారీకి వినియోగించిన యాలకులలో ఈ పెస్టిసైడ్స్ ఉన్నట్లు తేలింది. ఇప్పటికే ఉన్న 6 లక్షల పైచిలుకు ప్రసాదం టిన్నులను భక్తులకు ఇవ్వలేదు. దీనిని ఎరువుగా మార్చి రైతుల కోసం వినియోగంలోకి తెస్తామని కోర్టుకు వెల్లడించింది. కొట్టాయంలోని కార్యాలయానికి అరవణ ప్రసాదాన్ని టన్నుల కొద్దీ చేర్చారు. మకరజ్యోతి దర్శనం కోసం లక్షలాది మంది భక్తులు వచ్చే అవకాశం ఉండడంతో ఈ లోగా ప్రసాదాన్ని ఎరువుగా మార్చి, భారీగా కొత్త ప్రసాదాన్ని తయారు చేసే ప్రణాళికలు చేస్తున్నారు.

