‘పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డి మంచివాళ్లు కాబట్టే ప్రజలు ఓట్లు వేశారు’-జగన్
మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ఘటనపై పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డిలపై ఆధారాలు లేని ఆరోపణలు వేస్తున్నారని మండిపడ్డారు వైసీపీ నేత జగన్. వారిద్దరూ మంచివాళ్లు కాబట్టే ప్రజల ఓట్లు వేసి గెలిపిస్తున్నారని వ్యాఖ్యానించారు. సబ్ కలెక్టర్ కార్యాలయంలో అగ్ని ప్రమాద ఘటనకు పెద్దిరెడ్డి ప్లాన్ చేశారని వారిపై నిందలు మోపి, వారిని అభాసుపాలు చేయడం దారుణం అన్నారు. ఈ ఘటనపై అధికార యంత్రాంగం హడావుడి చేయడం చాలా ఆశ్చర్యంగా ఉందన్నారు.

