Andhra PradeshHome Page Slider

వైసీపీ ప్రభుత్వం పై జనాగ్రహం

◆ ప్రజల ఆస్తులను జగన్ కొల్లగొడుతున్నారు
◆ అమరావతిలో 3 లక్షల కోట్ల సంపద ఆవిరి
◆ జగన్ వైఖరిలో మార్పు రాకపోతే ప్రజలే భూస్థాపితం చేస్తారు
◆ టీడీపీ ద్వారానే బీసీలకు న్యాయం
◆ బొబ్బిలి సభలో టీడీపీఅధినేత చంద్రబాబు ధ్వజం

రాష్ట్రంలో బీసీలను సీఎం జగన్మోహన్ రెడ్డి మోసం చేస్తున్నారని జగన్ వైఖరిలో మార్పు రాకపోతే ప్రజలే శాశ్వతంగా వైసీపీ పార్టీని భూస్థాపితం చేస్తారని మాజీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. విజయనగరం జిల్లా బొబ్బిలి పట్టణంలో నిర్వహించిన ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో భాగంగా ఆయన ప్రసంగించారు. చంద్రబాబు రెండో రోజు పర్యటనలో భాగంగా రాజాం నుంచి కాన్వాయిగా బొబ్బిలికి చేరుకున్నారు. అనంతరం జరిగిన సభ లో ఆయన ప్రసంగించారు. ఉత్తరాంధ్రను అభివృద్ధి చేస్తానని చెప్పి రాష్ట్ర రాజధాని అంటూ ప్రచారం చేస్తున్నారని కానీ విశాఖను గంజాయి మాదకద్రవ్యాల రాజధానిగా మార్చేశారని అన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని జగన్ ప్రభుత్వం మూడు రాజధానులు కట్టగలదా అని ప్రశ్నించారు.

పేదవాడికి అన్నం పెట్టేందుకు అన్నా క్యాంటీన్ లు ఏర్పాటు చేస్తే వాటిని మూయించారని విదేశీ విద్య లేకుండా చేశారని చంద్రన్న బీమా పెళ్లి కానుక క్రిస్మస్ సంక్రాంతి కానుకలు లేకుండా చేశారని అన్నారు. ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు పక్కదారి పట్టిస్తున్నారని జాబ్ క్యాలెండర్ బదులు జాబ్ లెస్ క్యాలెండర్ గా మార్చారాని అన్ని రంగాల్లో రాష్ట్రం దిగజారిపోయిందని పేర్కొన్నారు. మహిళలపై దాడులు అత్యాచారాలు పెరిగిపోయాయని ఇన్ని అక్రమాలు దోపిడీలు చేస్తున్న సైకో జగన్ కు భారతరత్న ఇవ్వాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెనుకబడిన తరగతులు అభివృద్ధి సంక్షేమ టీడీపీ తోనే సాధ్యమని అన్నారు. టీడీపీ పథకాలకు రంగులు మార్చి గొప్పలు చెప్పుకోవడం అన్యాయమని టిడ్కో ఇల్లు ఇప్పటివరకు పేదలకు ఇవ్వలేదని టీడీపీ అధికారంలోకి వచ్చి ఉంటే పెన్షన్ 3000 ఇచ్చే వారమన్నారు.

తన రాజకీయ అనుభవం అంత వయసు జగన్ కు లేదని జగన్ తండ్రి కంటే ముందే ముఖ్యమంత్రి అయ్యానని తనకి కథలు నేర్పించవద్దని రాజకీయం చేస్తే రాజకీయం చేస్తానని దోపిడీ చేస్తే దోపిడీదారుల గుండెల్లో నిద్ర పోతానని చంద్రబాబు విరిచుకుపడ్డారు. రాష్ట్రం నుంచి పరిశ్రమలు తరలిపోతున్నాయని అమరావతిలో 3 లక్షల కోట్ల సంపాదన ఆవిరి చేశారని, రైతు ఆత్మహత్యల్లో ఏపీది మూడో స్థానం అని ఆవేదన వ్యక్తం చేశారు. ఇవే రాష్ట్రానికి చివరి ఎన్నికలని సమయం లేదని ప్రజల్లో చైతన్యం రావాలని ప్రతి ఒక్కరు పిడికిలి బిగించాలని జగన్ ను ఇంటికి పంపాలని అన్నారు.