Andhra PradeshHome Page Slider

పవన్ బాగు పడాలంటే ‘చిరంజీవి’ మాట వినాలి

పవన్ కళ్యాణ్ బాగుపడాలంటే చంద్రబాబు మాట కాదు, చిరంజీవి మాట వినాలంటూ వ్యాఖ్యానించారు ఏపీ మంత్రి రోజా. పవన్ రోజుకో మాట మాట్లాడుతున్నాడని ఎద్దేవా చేశారు. ఒకరోజు ఒక ఊరిలో సీఎం అయిపోతానంటాడు, మరో ఊరిలో ఎమ్మెల్యేనయినా అవ్వాలంటాడు. అసెంబ్లీకి పంపించమంటున్నాడు. వైసీపీ పార్టీని, ఎమ్మెల్యేలను కొడతానంటున్నాడు. మమ్మల్ని కొట్టడానికే పార్టీ పెట్టాడా అంటూ మండిపడ్డారు. అమ్మవారి పేరుతో పెట్టిన వారాహి అనే వాహనంపై తిరుగుతూ బూతులు మాట్లాడడానికి సిగ్గులేదా అంటూ విమర్శించారు. మీరు సింగిల్‌గా వచ్చినా, గుంపులు గుంపులుగా వచ్చినా వచ్చే ఎన్నికల్లో సీఎం అయ్యేది జగనే అంటూ ధీమా వ్యక్తం చేశారు. తన జోలికి వస్తే, తనను ట్రోల్ చేస్తే జనసేన కార్యకర్తల అంతు చూస్తానంటూ హెచ్చరించారు.