రోగికి చేతి గాజుల సాయం అందించిన కేరళ మంత్రి
త్రిస్సూర్ జిల్లా ఇరింజలకుడలో జరిగిన వైద్య సహాయ కమిటీ సమావేశానికి ఎమ్మెల్యే హోదాలో కేరళ ఉన్నత విద్యాశాఖ మంత్రి ఆర్.బిందు హాజరయ్యారు. ఈ క్రమంలోనే కిడ్నీ సమస్యతో బాధ పడుతున్న వివేక్ ప్రభాకర్ పరిస్ధితిని తెలుసుకున్న ఆమె చాలా బాధ పడ్డారు. వివేక్‌కు కిడ్నీ మార్పిడి చేయడం అత్యవసరం అని డాక్టర్స్ అన్నారు కానీ.. అతని దగ్గర అంత డబ్బులేని కారణంగా చికిత్స చేయించుకోలేని పరిస్ధితి. ఈ సంగతి తెలుసుకున్న మంత్రి బిందు వేంటనే తన చేతికి ఉన్న బంగారు గాజులను తీసి, వివేక్‌కు చికిత్స నిమిత్తం అందజేశారు. ఆమె చేసిన పనికి అందరు ఆమెను ప్రశంసించారు. మంచి మనస్సుతో ఎంతో మందికి ఆదర్శంగా నిలిచారు మంత్రి బిందు.