కేటీఆర్‌పై పవన్ కళ్యాణ్ ట్వీట్..
బీఆర్‌ఎస్ నేత కేటీఆర్‌నుద్దేశించి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ట్వీట్ చేయడం ఆసక్తిగా మారింది. రాజకీయాల విషయంలో బేధాభిప్రాయాలున్నా, వ్యక్తిగతంగా సోదరభావం ఉందని వెల్లడించారు. కేటీఆర్ నిన్న జిమ్‌లో వర్కౌట్లు చేస్తూ గాయపడిన సమాచారం తెలియడంతో పవన్ కళ్యాణ్ ట్వీట్ చేస్తూ, సోదరుడు కేటీఆర్ త్వరగా కోలుకోవాలని, ఆయనకు గాయం తగిలిన సంగతి తెలిసి చాలా బాధపడ్డానని పేర్కొన్నారు. తగిన విశ్రాంతి తీసుకుని త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను అంటూ ఎక్స్ ఖాతాలో పేర్కొన్నారు.

