Andhra PradeshNewsNews Alert

తిరుపతిలో పర్యటించనున్న పవన్ కళ్యాణ్

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆగస్టు 21, ఆదివారం నాడు తిరుపతిలో “జనవాణి-జనసేన భరోసా” కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. జీఆర్‌ఆర్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో ఈ కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలియజేశారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 21న తిరుపతిలో జనవాణి కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు జనసేన పార్టీ ప్రకటించింది. ప్రజలు నేరుగా వారి సమస్యలను పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకురావచ్చని వారు తెలియజేశారు. ప్రజల నుంచి వచ్చే అర్జీలను స్వీకరించి పవన్ కళ్యాణ్ వారి సమస్యలను నేరుగా అడిగి తెలుసుకుంటారని, ఆపై వారి సమస్యల పరిష్కారం కోసం అధికారులకు ఆయా శాఖల వారీగా లేఖలు రాస్తారని జనసేన పేర్కొంది. ఇప్పటికే జనవాణి కార్యక్రమం విజయవాడలో రెండు విడతలు పూర్తి చేసుకోగా, భీమవరంలో కూడా ఈ కార్యక్రమాన్ని ఇటీవల పూర్తి చేసుకున్నారు.

నాలుగో విడత కార్యక్రమంగా తిరుపతిలో జనవాణి జరగబోతుంది. మూడు విడతల్లో ప్రజల వద్ద నుంచి వచ్చిన సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తూ, ఆయా శాఖల వారీగా పరిష్కరించేందుకు జనసేన పార్టీ తరఫున ప్రత్యేక సిబ్బంది కృషి చేస్తోంది. ఈ మేరకు ప్రభుత్వ శాఖలకు పవన్ కళ్యాణ్ ఇప్పటికే ప్రత్యేకంగా లేఖలు రాశారు” అని పేర్కొన్నారు. రాయలసీమ, నెల్లూరు జిల్లాల నుంచి ప్రజల దరఖాస్తులు స్వీకరిస్తానని పవన్ కల్యాణ్ చెప్పారు.