చంద్రబాబును అధఃపాతాళానికి తొక్కుతున్న పవన్.. విషయం తెలిస్తే షాక్ ?
వచ్చే ఎన్నికల్లో టీడీపీతోనే పొత్తు
కష్టాల్లో ఉన్న టీడీపీని ఆదుకుంటున్నా
అందుకే ఎన్డీఏ నుంచి బయటకొచ్చా
ఏపీలో వచ్చేది టీడీపీ-జనసేన సర్కారే
వారాహి యాత్రలో పవన్ కల్యాణ్ ట్విస్ట్
ఏపీ రాజకీయాలు అనూహ్య మలుపులు తీసుకుంటున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు జైలుకు వెళ్లి సుమారుగా నెల రోజులు కావొస్తోంది. చంద్రబాబు నాయుడు బయటకు ఎప్పుడు వస్తాడాని, టీడీపీ శ్రేణులు, నాయకులు బెంగపెట్టుకుంటున్నారు. ఈ తరుణంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర ద్వారా టీడీపీలో ఉత్సాహం తీసుకొస్తున్నారన్న భావన వ్యక్తమవుతోంది. అయితే ఇవి పరోక్షంగా టీడీపీకి నష్టం కలిగిస్తాయన్న వర్షన్ కూడా ప్రచారంలో ఉంది. పవన్ కల్యాణ్ చంద్రబాబునాయుడికి మేలు చేస్తున్నారా? లేదంటే కీడు చేస్తున్నారా అన్న చర్చ కూడా సాగుతోంది. టీడీపీతో జనసేన పొత్తుకు, చంద్రబాబు నాయుడు వ్యవహారానికి ఎలా ముడిపెడతారన్న విమర్శ కూడా ఉంది. అయితే ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్‌తో పాటుగా, రాజధాని భూముల వ్యవహారం, ఫైబర్ నెట్ కేసుల్లో చంద్రబాబుపై సీఐడీ ఆరోపణలు గుప్పిస్తోంది.

ఈ తరుణంలో వచ్చే ఎన్నికల్లో కలిసి పనిచేయాలని టీడీపీ-జనసేన భావిస్తున్నప్పటికీ సీన్ మరోలా రక్తికడుతోంది. 2019 అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీజేపీతో పొత్తు కోసం తహతహలాడిన పవన్ కల్యాణ్ ఇప్పుడు ఎందుకు కాషాయం పార్టీని వదిలేస్తున్నారా అన్న అనుమానాలు రెకెత్తుతున్నాయి. పవన్ కల్యాణ్ టీడీపీతో ఎంత క్లోజ్ గా మూవ్ అయితే.. టీడీపీకి అన్ని ఇబ్బందులు తప్పవన్న వర్షన్ ప్రచారంలో ఉంది. ఈ వ్యవహారశైలి కష్టాల్లో ఉన్న టీడీపీకి ఆక్సిజన్ అందిస్తాయా? లేదంటే మరిన్ని ట్రబుల్స్ కలిగిస్తాయా అన్న అనుమానం కూడా కలుగుతుంది. నిలకడలేని పవన్ కల్యాణ్ రోజుకోలా మాట్లాడటం కూడా మనం గమనించాలి. ఓసారి టీడీపీతోనే కలిసి పోటీ చేస్తానని క్లారిటీ ఇచ్చాక మళ్లీ తాను ఎన్డీఏ నుంచి ఇంకా బయటకు రాలేదని.. ఒకవేళ అలాంటిది ఏదైనా ఉంటే చెప్పి చేస్తానని కూడా వ్యాఖ్యానించడాన్ని చూడాల్సి ఉంది. మొత్తంగా పవన్ కళ్యాణ్ భయంకరమైన కన్ఫ్యూజన్లో ఉన్నారని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. పూటకో మాట రోజుకో రీతి అన్నట్టుగా పవన్ కళ్యాణ్ వ్యవహార శైలి కనిపిస్తోంది.

మొత్తంగా రిమాండ్‌లో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు జైలు నుంచి బయటకు ఎప్పుడొస్తారోనన్న అనుమానంలో ఉన్న పసుపు పార్టీ.. వచ్చే రోజుల్లో నారా భువనేశ్వరిని రంగంలోకి దింపాలని భావిస్తోంది. ఇప్పుడప్పుడే చంద్రబాబునాయుడు జైలు నుంచి బయటకు రారేమోనన్న క్లారిటీ పార్టీకి వస్తున్నట్టుగా ఉంది. ఓవైపు పవన్ కళ్యాణ్ వారాహి యాత్రకు పెద్ద ఎత్తున ప్రచారం కల్పిస్తున్న మీడియా, వచ్చే రోజుల్లో భువనేశ్వరి యాత్రకు ఎక్కువ సమయం కేటాయించవచ్చు. మొత్తంగా పవన్ కల్యాణ్, మోడీ మద్దతుతో 2014లో విజయం సాధించిన చంద్రబాబుకు ఇప్పుడు కేవలం పవన్ కల్యాణ్ నుంచి మాత్రమే మద్దతు లభిస్తుంటే.. మోడీ నుంచి సానుకూలత మాత్రం లభించడం లేదు.