Andhra PradeshHome Page Slider

పిఠాపురం వాస్తవ్యుడిగా మారిన పవన్ కళ్యాణ్

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇవాళ పిఠాపురంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో పాల్గొన్నారు.ఈ సభలో పవన్ కీలక వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వంలో నేతలు పవన్ కళ్యాణ్ ఏపీలో ఉండరని ఆరోపించారన్నారు. అయితే ఇప్పుడు నేను పిఠాపురంలో 3 ఎకరాల పొలం కొని పిఠాపురం వాస్తవ్యుడిగా మారానన్నారు. కాగా ప్రజలు కొంత సమయం ఇస్తే రాష్ట్రంలో ఉన్న సమస్యలన్నీ తీరుస్తామని పవన్ హామీ ఇచ్చారు. కుల,మత భేదాలు లేకుండా ఏపీ ప్రజలందరికీ న్యాయం చేస్తామన్నారు. అయితే రాష్ట్రాన్ని పాలించడానికి చంద్రబాబు గారి అనుభవం,దక్షత కావాలన్నారు. అందుకే చంద్రబాబు గారి మద్దతు కోరానని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.గతంలో వైసీపీ నేతలు అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వమని సవాల్ చేశారు. కానీ ఈసారి అసెంబ్లీ గేట్లు బద్దలు కొట్టుకుంటూ లోపలికి ప్రవేశించామని పవన్ వెల్లడించారు.అయితే దీనికి కారణం మీరే అని పవన్ ఏపీ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు.