మొన్న జగన్, నేడు పవన్.. అమిత్ షా తో కీలక చర్చలు
జనసేన అని పవన్ కళ్యాణ్ ఇవాళ ఢిల్లీ వచ్చారు. బిజెపి చీఫ్ తో జనసేనాని భేటీ కాబోతున్నారు. అనంతరం కేంద్ర హోం మంత్రి అమిత్ షా తోను ఆయన చర్చలు జరపనున్నారు. ఏపీలో గత కొంతకాలంగా బిజెపి జనసేన మధ్య భేదాభిప్రాయాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఢిల్లీ పెద్దలతో పవన్ కళ్యాణ్ చర్చించబోతున్నట్లు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ టిడిపి తో కలిసి ఎన్నికల బరిలో దిగుతారంటూ ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. కచ్చితంగా వారం రోజుల క్రితం ఏపీ సీఎం వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి రెండుసార్లు ఢిల్లీ వచ్చారు. ప్రధాని నరేంద్ర మోడీతో పాటు హోం మంత్రి అమిత్ షా తోను ఆయన చర్చలు జరిపారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముందస్తు ఎన్నికలకు వెళ్లబోతున్నట్టుగా గత కొంతకాలంగా జరుగుతున్న ప్రచారానికి తోడు ఆయన పర్యటనలు కీలకంగా మారాయి.


