ఢిల్లీలో పవన్ కల్యాణ్.. పలువురు కేంద్ర మంత్రులతో భేటీ
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఢిల్లీ పర్యటనలో బిజీ బిజీగా ఉన్నారు. కాసేపట్లో కేంద్రమంత్రి గజేంద్రసింగ్‌తో పవన్ భేటీ కానున్నారు. పలువురు కేంద్రమంత్రులను పవన్ కల్యాణ్ కలవనున్నారు. మధ్యాహ్నం ఒంటి గంటకు కేంద్ర జలశక్తి మంత్రితో భేటీ అవుతారని సమాచారం. మధ్యాహ్నం 3:15కి నిర్మలా సీతారామన్‌తో.. సాయంత్రం 4:30 గంటలకు రైల్వేశాఖమంత్రి అశ్వినివైష్ణవ్‌తో.. సాయంత్రం 5:15కి లలన్ సింగ్‌తో పవన్‌కల్యాణ్ సమావేశం కానున్నారు. రేపు పార్లమెంట్‌లో ప్రధాని నరేంద్ర మోడీతో పవన్ భేటీకానున్నట్లు తెలుస్తోంది.

