ఇరాన్ కు మద్దతివ్వని ముస్లిం దేశాలు.. ఎందుకంటే ?
ఒక ముస్లిం దేశం నష్టపోతుంటే మిగతా ముస్లిం దేశాలు అండగా ఉండాలని అనధికార ఒప్పందం ఉంది. తాజాగా ఇజ్రాయెల్ దేశంతో యుద్ధంలో ఏ ముస్లిం దేశం ఇరాన్ కు అండగా నిలబడటం లేదు. హమాస్, హెజ్బొల్లా, హౌతీ రెబల్స్ వంటి ఉగ్రవాద గ్రూపులకు సపోర్ట్ చేస్తూ.. మిడిల్ ఈస్ట్ లో ఇరాన్ అశాంతికి కారణమవుతోందని ఆ దేశాలు అభిప్రాయపడుతున్నాయి. దీంతో పాటు ఇరాన్ కు అండగా లేదా మద్దతిస్తే అగ్రరాజ్యం అమెరికా కోపానికి గురవ్వక తప్పదని భావిస్తున్నాయి. అంతే కాకుండా దాని ఫలితంగా వ్యాపార పరంగా నష్టపోతామని అంచనా వేస్తున్నాయి. ట్రేడ్ డీల్ దెబ్బతింటాయని ..దౌత్య సంబంధాలకు ఆటంకాలు ఎర్పడతాయని ఆ దేశాలు యోచనతో ఇరాన్ కు మద్దతు ఇచ్చే ఆంశంలో వెనకడుగు వేస్తున్నాయి.