Home Page SliderNational

సంచలనం సృష్టించిన పవన్‌కళ్యాణ్

పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ సత్తా సినిమాల్లోనే కాదు..రియల్ లైఫ్‌లో కూడా ఓ రేంజ్‌లో ఉంటుంది. టాలీవుడ్ టాప్ హీరోల్లో ఒకరిగా..జనసేన పార్టీకి అధినేతగా ఉన్న పవన్ కళ్యాణ్ తాజాగా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. దీంతో ఇన్‌స్టాగ్రామ్ ఒక్కసారిగా షేక్ అయ్యిందనే చెప్పాలి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఇన్‌స్టాగ్రామ్‌లోకి అడుగుపెట్టిన కొన్ని గంటల్లోనే 1 మిలియన్ ఫాలోవర్లను దక్కించుకున్నారు. కాగా అకౌంట్ క్రియేట్ చేసిన కేవలం 8 గంటల్లోనే 10లక్షల మంది ఫాలోవర్లను సొంతం చేసుకున్నారు. దీంతో ఒక్క పోస్ట్ కూడా చేయకుండానే అత్యధిక ఇన్‌స్టా ఫాలోవర్లను పొందిన ఏకైక టాలీవుడ్ నటుడిగా పవర్‌స్టార్ చరిత్ర సృష్టించారు.ఈ నేపథ్యంలో “ఇది సార్.. పవర్‌స్టార్ రేంజ్” అని ఫ్యాన్స్ ట్వీట్స్ చేస్తున్నారు.దీంతో ట్విటర్‌లో కూడా #pawankalyanininstagram ట్రెండింగ్‌ అవుతోంది.