పీసీబీ ఆఫీస్‌లో ఫైల్స్ దగ్దంపై పవన్ ఆరా
ఏపీలో పీసీబీ ఆఫీస్‌లో ఫైల్స్‌ను అధికారులు దగ్ధం చేయడం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. కాగా ఈ ఘటనపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆరా తీశారు.పీసీబీ ఆఫీస్ అధికారులు కృష్ణా,కరకట్టపై రికార్డులను దగ్దం చేయడంపై పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఫైల్స్ ,రిపోర్టుల వివరాలు ఇవ్వాలని పవన్ అధికారులకు ఆదేశించారు. ఈ మేరకు బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన పేర్కొన్నారు. పీసీబీ ఆఫీసుల్లో రిపోర్టుల భద్రత కోసం అనుసరిస్తున్న విధానాలు వెల్లడించాలని పవన్ కోరారు.

