Andhra PradeshNews

ముందస్తుకు వస్తావా జగన్… సై అంటున్న పవన్

Share with

◆వైసీపీ ప్రభుత్వం పై వరుస బాణాలు ఎక్కు పెట్టిన జనసేన
◆ కొత్త కార్యక్రమాలతో నిత్యం ప్రజల్లోకి జనసేన
◆ విజయవాడలో జనవాణి కార్యక్రమం

ఆంధ్రప్రదేశ్లో అధికారపక్షం పై జనసేన పార్టీ వరుస బాణాలు ఎక్కుపెడుతుంది. నిత్యం జనంలో ఉండాలనే లక్ష్యంతో ఎప్పటికప్పుడు కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడుతుంది. కౌలు రైతు భరోసా యాత్ర మొదలుకొని వరుస కార్యక్రమాలతో జనసేన పార్టీ వారు కొనసాగుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సమస్యలను పట్టించుకోవడం లేదని బలంగా విశ్వసిస్తున్న పవన్ కళ్యాణ్ నేరుగా జనంలోకి వెళ్లాలని నిర్ణయించినట్లు తెలుస్తుంది. అందులో భాగంగానే జనవాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. దాంతోపాటు గత రెండు రోజులుగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రభుత్వంపై ట్విట్టర్ వేదిక విరుచుకుపడుతున్నారు. ప్లీనరీలో సీఎం జగన్ తమ మేనిఫెస్టోలో 95% హామీలు అమలు చేశారని చెప్పటంపై జనసేన పార్టీ అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. మేనిఫెస్టోలో ఉన్న 95 శాతం హామీలను నెరవేర్చామని సీఎం జగన్ చెబుతున్నారని అదే నిజమైతే తక్షణమే ఎన్నికలకు రావాలని జనసేన పిఎసి కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ సవాలు విసిరారు. రెండు రోజుల ప్లీనరీ సమావేశాలు సర్కస్ కంపెనీని గుర్తుకు తెచ్చాయని ఆయన ఎద్దేవా చేశారు.

విజయవాడలో జనవాణి కార్యక్రమం :

విజయవాడలోని మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో నేడు జనవాణి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హాజరై స్వయంగా అర్జీలు స్వీకరించారు.